Authorization
Fri March 21, 2025 10:23:23 am
నవతెలంగాణ-సరూర్‌నగర్
మాదకద్రవ్య రహిత తెలంగాణ ఏర్పాటుకు ప్రజలందరూ సహకరించి డ్రగ్స్ భూతాన్ని తరిమికొడదామని రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి టీ రవీందర్రావు అన్నారు. సోమవారం టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాల, ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం, దాని వల్ల జరిగే అనర్థాలు గురించి వివరించారు. మాదకద్రవ్యాలను వినియోగించి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసరావు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసరావు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు ముజాహిద్ సుతారి, ఇబ్రహీం భాష, సమజ, సిబ్బంది పాల్గొన్నారు.