Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమపై తప్పుడు కథనాన్ని ఖండిస్తున్నాం
మొబైల్ హెల్త్ టీం వెహికిల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ అధ్యక్షులు టి. బాలయ్య
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో మొదటి వేవ్ నుంచి 3వ వేవ్ వరకు ఆర్బీఎస్ కే అద్దె వాహనాలను వ్యాక్సినేషన్ కోసం, కోవిడ్ సర్వేకు, డయాలసీస్ రోగులకు ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం ప్రాణాలకు తెగించి ఉపయోగించామని మొబైల్ హెల్త్ టీం వెహికిల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ అధ్యక్షులు టి. బాలయ్య తెలిపారు. సోమవారం కోఠిలోని డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమం (ఆర్బీఎస్కే) అద్దె వాహనాలను కోవిడ్ సమయంలో తీయకుండానే బిల్లులు క్లైమ్ చేసుకున్నట్లు ఓ ఆన్ లైన్ పత్రికలో వచ్చిందని అది 100% శాతం అవాస్తవమన్నారు. తాము కోవిడ్ సమయంలో నిర్వహించిన వైద్య సేవలకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. ఇలాంటి కథనం వల్ల కోవిడ్ రోగులకు ఎంతగానో నష్టం జరుగుతుందన్నారు. డిజిల్ ధరలు పెరిగినా, తమకు మూడు నెలలకు ఒకసారి బిల్లులు వచ్చినా ప్రజల ఆరోగ్యాలను దష్టిలో పెట్టుకుని ఆరోగ్య శాఖకు సేవలందించామని తెలిపారు. ఇలాంటి అవాస్తవాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్. ప్రధాన కార్యదర్శి జగన్, పెద్దఎత్తున వాహనదారులు పాల్గొన్నారు