Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్న కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఎంఎస్ఎఫ్్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ డిమాండ్చేశారు. సోమవారం ఓయూలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను పాలించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం చెంది ఆ నెపాన్ని రాజ్యాంగం మీద వేస్తున్నారని అన్నారు. దళితుల కోసమే రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్న కేసీఆర్ దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడు ఎకరాల భూమిని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీసీ కుల గణన, రిజర్వేషన్లు పెంపు, మహిళలకు రిజర్వేషన్లు, ఆస్తి హక్కు ఇవన్నీ రాజ్యాంగంలోనే ఉన్నాయి. వాటిని అమలు చేయకపోతే పాలకులు విఫలమైనట్లే కానీ రాజ్యాంగం విఫలమైనట్లు కాదనే ఇంగిత జ్ఞానం కేసీఆర్కు లేదని అన్నారు. కేవలం స్వేచ్ఛగా నియంతత్వ రాచరిక పరిపాలనను కొనసాగించడానికి మాత్రమే రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నాడే తప్ప సరైన కారణం లేదని అన్నారు. రాజ్యాంగాన్ని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే మంద కష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు వెంకట్ గళ్ళ వెంకట్ మాదిగ, ఓయూ అధ్యక్షులు కొమ్ము శేఖర్ మాదిగ, ప్రధాన కార్యదర్శి చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, సీనియర్ నేతలు ఈరెంటి విజరు మాదిగ, బుషిపాక గణేష్ మాదిగ, తోకల చిరంజీవి మాదిగ, సురారపు శ్రీను మాదిగ, ఎర్ర వీరన్న మాదిగ, సినపల్లి కష్ణ మాదిగ, గోలెం ప్రసాద్ మాదిగ, శ్రీకాంత్ మాదిగ, అనిల్ మాదిగ పాల్గొన్నారు.