Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీఎం కష్ణ ప్రసాద్
నవతెలంగాణ-అంబర్‌పేట
కష్టాల్లో ఉన్న వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక శాతం వడ్డీ డబ్బులను ఇస్తున్న వడ్డీ వ్యాపారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని ఇండియన్ నేషనలిస్ట్ మూవ్ మెంట్ జాతీయ అధ్యక్షుడు ఎం. కష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం కాచిగూడ టూరిస్ట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వద్ది అజరు కుమార్ ఆస్తుల దోపిడీకి పాల్పడిన జవహర్ రెడ్డి దుశ్చర్యలపై బహిరంగ విచారణ జరిగింది. ఈ సందర్భంగా కష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలను జలగల పిడిస్తున్న వడ్డీ వ్యాపారుల నుంచి సామాన్య ప్రజలను కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. బర్కత్‌పురా ప్రాంతానికి చెందిన వడ్డీ వ్యాపారి జవహర్ రెడ్డి అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోయిందని అన్నారు. వద్ది అజరు కుమార్‌కు నాలుగు కోట్ల అప్పు ఇచ్చి అప్పు కింద 14 కోట్ల విలువగల భువనగిరిలోని ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ, మూసారాంబాగ్‌లో ఉన్న అజరు అత్తగారి ఇంటిని ఏజీఏపీఏ తన పేరు మీద రాయించుకుని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వడ్డీ వ్యాపారి జవహర్ రెడ్డిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అధిక వడ్డీలను వసూలు చేయడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు తమ ఇష్టాను సారంగా మోసాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వద్ధి అజరు కుమార్, నవీద్ తదితరులు పాల్గొన్నారు.