Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించేందుకు కృషి చేస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం కవాడిగూడ డివిజన్ సింగడి కుంట, కొత్త బజార్లో మంచి నీటి పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ రచన శ్రీతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్లోని సింగాడి కుంటలో రూ. 12 లక్షల నిధులతో, కొత్త బజారులో రూ.7 లక్షల నిధులతో మంచినీటి పైప్లైన్ పనులను ప్రారంభించామని తెలిపారు. రాబోవు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన మంచి నీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో డ్రయినేజీ పైపులైను లీకేజీ వల్ల మంచినీరు కలుషితమయ్యేదని తెలిపారు. వాటి స్థానంలో నూతన పైపులైన్ నిర్మాణంతో సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందనాష్ట్ర్నరు. కార్యక్రమంలో యువ నాయకులు ముఠా జైసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వల్లాల శ్యామ్ యాదవ్, కార్యదర్శి సాయికృష్ణ, వల్లాల శ్రీనివాస్ యాదవ్, రామ్ చందర్, రాజశేఖర్ గౌడ్, శ్రీహరి, ప్రభాకర్, ప్రవీణ్, జమాలుద్దీన్, కారిక కిరణ్, ముచ్చకుర్తి ప్రభాకర్, కార్తీక్, శ్రీధర్ రెడ్డి, సంతోష్, జల మండల అధికారి డీజీఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.