Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముషీరాబాద్ ఎమ్మెల్యే
ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్మెట్
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పలు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహిస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. సోమవారం గాంధీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ జన్మదిన వేడుకలను మూడురోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో పేదలకు అన్నదానం కార్యక్రమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేయాల్సిందిగా కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పేద విద్యార్థులకు పుస్తకాలు, పేదలకు బట్టలు పంపిణీ చేస్తామని తెలిపారు. నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ముఖ్యమంత్రి పుట్టినరోజు నాడు సర్వమత ప్రార్థనలు చేస్తామని తెలిపారు. ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామన్నారు. సమావేశంలో యువ నాయకులు ముఠా జై సింహ, మాజీ కార్పొరేటర్ ముఠా నరేష్ కవాడిగూడ, అడిక్మెట్, గాంధీనగర్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, బల్ల శ్రీనివాసరెడ్డి, రాకేష్, శ్యాంసుందర్, మాధవ్, సురేందర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.