Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్
నవతెలంగాణ-బంజారాహిల్స్
నిజాంపేటలోని ఆగ్ పే పుల్ గాస్పల్ చర్చిలో క్రైస్తవ మహిళలకు స్వచ్ఛంద బొట్టు ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిల్ తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కతిలో స్త్రీలు బొట్టును తమ సంస్కతిలో భాగంగా భావిస్తారన్నారు. మతం, సంస్కతి వేరు అని, దేశ సంస్కతిని కాపాడేందుకు తమ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రైస్తవ స్త్రీలుగా మతం మారినా తమ ఆచార వ్యవహారాలను సంస్కతిని మార్చుకోవాల్సిన అవసరం లేదు అనే సందేశాన్ని అందించేందుకు ఈ బొట్టు ధారణ ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. నేటి కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా మహిళలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ ఆంధ్రతో పాటు ఉత్తర భారతదేశంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో పరిషత్ మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి, హైదరాబాద్ ప్రతినిధులు విజయ, అరుణ, మరియా, జీవన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.