Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
గ్రామీణ క్రీడాకారులకు అండగా ఉంటాం అని సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ మండలం కొర్రెములలో జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మునుకుంట్ల రమేష్ జ్ఞానకార్థం హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ టోర్నమెంట్లో క్రీడాకారులకు స్థానిక వార్డు సభ్యుడు ఎరుకల దుర్గరాజ్ గౌడ్ అల్పాహారం, భోజనం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామం నుంచి కబడ్డీతో పాటు వివిధ క్రీడలలో రాణించాలనుకున్న ఉత్సాహవంతులైన క్రీడాకారులకు గ్రామ పంచాయతీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, ఉపాధ్యక్షుడు మొగుల్ల సంతోష్ కుమార్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ బొడ్డు నాగార్జున, నాయకులు మాటూరి రవి, పసుమాల బాలరాజ్, చిలుకల నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.