Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సమాజంలో నిస్వార్దంగా పనిచేసేవారిని గుర్తించి గౌరవిస్తే వారికి ప్రేరణ, ఇతరులకు స్ఫూర్తినిచ్చి వారు మరింత ఉత్సహంగా వారి రంగాలలో పనిచేయ గలరని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు కారం రవీంద్రా రెడ్డి అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో మోర్డు, వంశీకష్ణ హౌలిస్టిక్స్ అధిపతులు శ్రీనివాస్, వంశీకష్ణ నిర్వహణలో వివిధ రంగ ప్రముఖులకు భారతీయ స్ఫూర్తి రత్న పురస్కార ప్రదానోత్సవం జరిగింది. కారం రవీంద్ర రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి (ఢిల్లీ) డాక్టర్ సముద్రాల వేణుగోపాలా చారి పాల్గొని మాట్లాడుతూ భారతీయ సంస్కతిని పరిరక్షిస్తున్న ఎందరో మహానుభావులలో కొందరిని ఎన్నుకొని వారిని సత్కరించటం ముదావహమన్నారు. అనంతరం క్రీడ, సామాజిక, సినిమా, టీవీ, నాట్యం, సంగీతం, నాటకం, గహ నిర్మాణం, బ్యాంకింగ్, వైద్యం, విద్య, ఆతిథ్యం, యువ శక్తి తదితర 24 రంగాల్లో 150 మంది ప్రతిభావంతులైన వారిని భారతీయ స్ఫూర్తిరత్న పురస్కారాలు బహుకరించారు. నటులు రాగిణి, రాకేష్, జీవన్, సుధా జైన్, శ్యాం నారాయణ్ రామా నాయుడు, డాక్టర్ దీపక్, డాక్టర్ సాగర్, రమేష్ తదితరులు పురస్కార గ్రహితలను అభినందించారు. వంశీ కష్ణ స్వాగతం పలికిన సభకు ఏ. శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు.