Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేతన్నల ఐక్యత కార్యాచరణ కమిటీ చైర్మెన్ దాసు సురేష్
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలను పట్టించుకోవడం లేదని నేతన్నల ఐక్యత కార్యాచరణ కమిటీ చైర్మెన్ దాసు సురేష్ అన్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్న బైరి శంకరయ్య కుటుంబానికి సంఘీభావంగా సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ నిర్వహించారు. నాడు నేతన్నల కోసం జోలె పట్టిన కేసీఆర్ నేడు మూకుమ్మడి ఆత్మహత్యలపై ఎందుకు స్పందించరని అన్ని పార్టీల సామాజిక సంఘాల ప్రతినిధులు నినదించారు. రాష్ట్రంలో నేతన్నల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఆగుతాయన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కోసం పోచంపల్లిలో ఆనాడు జోలె పట్టి, నేడు రాష్ట్రంలో సామూహికంగా నేతన్నల ఆత్మహత్యలు కొనసాగుతున్నా మాట్లాడేందుకు తీరిక లేదా అని ప్రశ్నించారు. వీవెర్స్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబ సభ్యుల సమక్షంలో హెల్ప్ లైన్ నంబర్ (9177756320)ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని డిమాండ్ చేశారు.