Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
టెలికాంనగర్‌లో ఏర్పాటైన ఓన్లీ ఫ్రైస్ అండ్ షేక్స్ మొదటి ఔట్‌లెట్‌ను సినీ డైరెక్టర్లు సంజనా రెడ్డి, వీఎన్ ఆదిత్య, ప్రముఖ రిసిస్ట్ కృష్ణకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజనా మాట్లాడుతూ కోవిడ్ ముగుస్తున్న తరుణంలో ఢిల్లీ తర్వాత ఫుడ్ బిజినెస్ హైదరాబాద్‌లో ఊపందు కుంటోందన్నారు. ఈ సమయంలో ఓఎఫ్ఎస్ లాంటి కాన్సెప్ట్ ఫుడ్ స్టోర్లు ఉద్భవించడం మంచి పరిణామం అన్నారు. కొత్త తరహా భోజన రుచుల కోసం భోజన ప్రియులు ఎప్పుడూ ఎదురు చూస్తుంటారని తెలిపారు. మంచి భోజనానికి ఆల్టర్నేట్గా ప్రారంభించిన ఓన్లీ ఫ్రైస్ అండ్ షేక్స్ ఆ కోవలో కొత్త ప్రయోగాన్ని రూపొందించడం బాగుందని డైరెక్టర్ వీఎన్ ఆదిత్య తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన రిసిస్ట్ కృష్ణకాంత్ మాట్లాడుతూ నూతన ఔత్సాహికులు ఫుడ్ ఇండిస్టీలో రాణిస్తు న్నారనీ, ఆ కోవలో నిర్వాహకులు విక్కీ, హరీష్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతున్నట్టు తెలిపారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, వెరైటీల ఫ్రై ఐటమ్లు, 20 రకాల థిక్‌షేక్ మిల్క్ షేక్‌లతో రుచులను అందిస్తున్నట్టు నిర్వాహకులు హరీష్, విక్కీ తెలిపారు.