Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మామిడి పల్లిలోని రంగనాయకుల కాలనీలో రూబెన్స్ నాయక్ అనారోగ్యంతో బాధపడటంతో 12వ డివిజన్ కార్పొరేటర్ యాతం పవన్ కుమార్ యాదవ్ మంత్రిని హాస్పిటల్ ఖర్చుల కోసం ఆదుకోవాలని కోరటంతో సీఎం రిలీఫ్ ఫండ్ రూ.25 వేల చెక్కును ఇప్పించారు. ఈ కార్యక్రమంలో మున్యా నాయక్, మురళి, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్, వాల్మీకి, తదితరులు పాల్గొన్నారు.