Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయిన్పల్లి న్యూసిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 20వ వార్షిక బ్రహౌత్సవాలు మంగళ వారం ఆరంభమయ్యాయి. అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమైన ఉత్సవాలు వేదపండితుల మంత్రోచ్చరణాలు, మంగళవాయిద్యాలు, ప్రత్యేక పూజాదికార్యక్రమాలను నిర్వహించారు. మహాకుంభ స్థాపనం, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బోయిన్పల్లి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్ఐ యుగంధర్, ఏఎస్ఐ ఆంజనేయులు, దేవాలయ కమిటీ చైర్మెన్ ఆర్.నారాయణ, కమిటీ ప్రతినిధులు యాదయ్య, లక్ష్మణ్, జగన్నాథం, సాంబశివరావు, ధరంవీర్, నర్సింహరావు, పెంటారెడ్డి, స్థానిక నాయకులు కల్యాణ్ అజిత్, కుమార్ పాల్గొన్నారు.