Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అండగా ఉంటానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారడంతో షర్మిలతోపాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఆ పార్టీ నాయకులు షర్మిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా షర్మిల పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన, అక్రమ అరెస్టులు చేస్తూ ఉండటం శోచనీయమన్నారు. ప్రజాస్వా మ్యబద్ధంగా తాము శాంతియుతంగా నిరసనలు చేపడితే ప్రభుత్వానికి ఎందుకు భయం వేస్తుందో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాటలు చెబుతూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారన్నారు. తెలం గాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆదేశాలు ఇవ్వలే దన్నారు. పార్టీ అధ్యక్షురాలునైన తనను 'మరదలు' అని సంభోదించినప్పటికీ ఆయనను సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగుల పక్షాన తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.