Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్/శామీర్పేట
శామీర్పేట మండలంలోని అంతాయిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా సమీకత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను వేగవంతంగా చేసి నెలరోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ హరీష్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ నిర్మాణ పనులను అధకారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణతోపాటు భవనాన్ని మొత్తం కలియదిరిగి పనులు ఎలా జరుగుతున్నాయి? ఇంకా ఏ మేం పనులు జరగాల్సి ఉంది? ఎప్పటిలోగా పూర్తవు తాయనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసు కున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై అధికారులు నెల రోజుల్లో పనులు పూర్తయ్యేలా పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలనీ, ఏమాత్రం అలస త్వం ప్రదర్శిచ వద్దన్నారు. ఆయా శాఖల ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు శ్రద్ధగా పని చేసి భవనాన్ని పూర్తి చేయాలని ఆదేశిం చారు. కలెక్టరేట్ భవనం, ఆవరణలో తిరిగి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంతోపాటు సంబంధిత శాఖల అధికారులు నివాసం ఉండే నివాసాల సముదా యాలను పరిశీలించి వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కలెక్టరేట్ ఆవర ణలో ఏర్పాటు చేయనున్న పార్కింగ్ స్థలాన్ని, ఫర్నీచర్ తదితర పనులను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ ఆవరణతో పాటు క్యాంప్ ఆఫీస్, అధికారుల నివాసాల వద్ద పచ్చదనం కోసం అందమైన మొక్కలను పెంచాలని సూచించారు. ప్రభుత్వం నూత నంగా నిర్మించి పూర్త యిన కలెక్టరేట్ సముదాయాలను ప్రారంభిం చేందుకు సిద్ధంగా ఉందనీ, ఇదే క్రమంలో కలెక్టరేట్ భవనాన్ని పూర్తిచేస్తే త్వరలోనే ప్రారంభోత్సవం జరుగుతుందని తెలిపారు. భవన నిర్మాణంతో పాటు ఫర్నీచర్ తదితర పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలనీ, ఈ విషయంలో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) శ్రీనివాస్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) శ్రీనివాసమూర్తి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.