Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బోడుప్పల్ పరిధిలోని భారతమాత వృద్ధాశ్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్డు అందజేశారు. సీఎం బర్త్డే వేడుకలు పురస్కరించుకుని టీఆర్ఎస్ కార్యకర్తలు అన్ని ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. కార్యక్రమంలో బోడుప్పల్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్ సింగిరెడ్డి పద్మా రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు రంగ బ్రహ్మన్న గౌడ్, సహకార బ్యాంకు డైరెక్టర్ జడిగే రమేష్ యాదవ్, నాయకులు బొమ్మకు విశ్వనాధ్, కొత్త చక్రపాణి గౌడ్, చిల్లా రమేష్, టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు రాసాల మహేష్ యాదవ్, కీర్తన్ రెడ్డి, సామల మనోహర్ రెడ్డి, ఉడుగుల మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.