Authorization
Sun April 06, 2025 09:29:18 am
నవతెలంగాణ-ఓయూ/బంజారాహిల్స్/సుల్తాన్‌బజార్
ఓయూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్, డా.బి.ఆర్.అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సంత్ సేవలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాలను మంగళవారం ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఆర్ట్స్ కళాశాల నుంచి ఠాగూర్ ఆడిటోరియం వరకు శోభాయాత్రను ఓయూ వీసీ ప్రొ. రవీందర్ యాదవ్ ప్రారంభించారు. గిరిజన విద్యార్థులు రీసెర్చ్‌పై దష్టి సారించాలని, అధ్యాపకులు వారి బోధనతో ఉత్తమ విద్యార్థులను తయారుచేసి విద్యా రంగ వికాసానికి, ఓయూ ఉన్నతికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర సమాచార చట్టం కమిషన్ సభ్యులు డా.శంకర్ నాయక్ మాట్లాడుతూ ఒకే జాతి ఒకే మాట, ఒకే చోట అనే నినాదంతో ముందుకు పోవాలని సూచించారు. వివిధ రంగాల్లో రాణించిన మలోతు పూర్ణ, జె. బాబు లాల్ నాయక్ నాయక్, రైటర్ రమేష్ కార్తిక్, అధ్యాపకుడు డా.భీమా నాయక్‌తో పాటుగా 20 మందిని ఓయూ వీసీ సత్కరించారు. అనంతరం హిందీ, తెలుగు, ఇంగ్లీషు, మూడు భాషల్లో నిర్వహించిన వ్యాస రచన, ఉపన్యాస పోటీల విజేతలకు నగదు, 2 కె రన్లో పాల్గొన్న సర్టిఫికెట్లు అందజేశారు. సభలో గిరిజన సాంస్కతిక సంప్రదాయలతో నిర్వహించిన కార్యక్రమాలు సభికులను అలరించాయి. కార్యక్రమంలో ఆడిషినల్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ జీవన్ లాల్, ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.మంగు నాయక్, రిజిస్ట్రార్ ప్రొ. లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ ప్రొ. రెడ్యా నాయక్, యూజీసీ డీన్ ప్రొ. మల్లేశం, ప్రొ. చంద్రు నాయక్, పాండు రంగ నాయక్, ప్రకాష్ రాథోడ్, డా.వి.రాజు నాయక్, ప్రొ. సూర్యదనుంజరు, ప్రొ. స్మిత పవర్, ప్రొ.సుశీల, ప్రొ. బీమా, రాజు పాడ్యా, మైనార్టీ సెల్ డెరైక్టర్ డా.సైయ్యాద అజీమ్ ఉన్నిసా, బీసీ సెల్ డెరైక్టర్ ప్రొ.యేసు రత్నం, ప్రొ. జాడి ముసలయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు..
కోఠి డీఎంహెచ్ఎస్ ఆఫీస్‌లో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ సింగ్, రాష్ట్ర శాఖ అధ్యక్షులు పాండు బి నాయక్, ప్రధాన కార్యదర్శి వి తిరుపతి నాయక్, కోశాధికారి ఏ జగన్, కార్యవర్గ సభ్యులు వివిధ సంఘాల నాయకులు జూపల్లి రాజేందర్, వెంకటేశ్వర్ రెడ్డి ప్రభాకర్, జైన్ డైరెక్టర్ కళావతి భారు, పారామెడికల్ బోర్డు చైర్మెన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ అధికార ప్రతినిధి ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బళ్ళు నాయక్, ధర్మేందర్, దినేష్, షేరు తదితరులు పాల్గొన్నారు.