Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైర్మెన్ లోక భూమా రెడ్డి
నవతెలంగాణ-ఓయూ
విజయ డెయిరీకి పాలు పోస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని చైర్మెన్ లోక భూమా రెడ్డి తెలిపారు. మంగళవారం లాలాపేట్‌లోని విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో విజయ డెయిరీ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధర్ సిన్హా, డైరెక్టర్ రామ్ చందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్, డెయిరీ సీనియర్ అధికారులు, అన్ని జిల్లాల డిప్యూటీ డైరెక్టర్లు, ఆర్ఎస్ఎంలు సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా విజయ డెయిరీ చైర్మెన్ లోక భూమా రెడ్డి మాట్లాడుతూ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు రూ.4 ఇన్సెంటివ్‌తో పాటు అదనంగా పాడి రైతుల పిల్లలను విద్యలో ప్రోత్సహించే విధంగా విద్యాకానుక, ఆడ బిడ్డ పెండ్లికి ఆర్థిక సహాయం కింద రూ. 5 వేలు, నిరంతరం పాలు పోసే వారికి విజయ మహారాజు, మహా రాణి కింద రూ. 2116, సబ్సిడీపై పశుదాన, ఉచిత పశు వైద్య శిబిరాలు, పాడి పశువుల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాలను విస్తత ప్రచారం నిర్వహించాలని అదికారులకు సూచించారు. జూన్‌లోగా 4.5 లక్షల పాల సేకరణను పెంచాలని దళిత బంధు పథకం ప్రారంభించినందున మినీ డెయిరీలను ఇవ్వాలని డీడీలకి ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం 700 కోట్ల వ్యాపారం జరుగుతుందని, దీనిని జూన్ నాటికి రూ. 750 కోట్లకు పెంచాలని, పాల ధరలు పెంచాలన్నారు. 124 ఉన్న బీఎంసీలను రూ.200కి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రతి 2 నెలలకి ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని, డెయిరీని ఇంకా అభివద్ధి చేయాలని సూచించారు.