Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
సెల్‌ఫోను పోయిందంటూ ఓ వ్యక్తి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన ఆరు గంటల లోపు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రామ్‌నగర్‌కు చెందిన జనగాం శ్రీనివాస్ గౌడ్ సోమవారం రాత్రి సుమారు పది గంటల సమయంలో సెల్ ఫోన్లో వాట్సాప్ వాడుతూ నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో పల్సర్ బైక్ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సెల్ ఫోన్ లాక్కుని పారిపోయారు. బాధితుడు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ పర్యవేక్షణలో సీసీ కెమెరాలను పరిశీలించి మంగళవారం పార్సిగుట్ట చౌరస్తా వద్ద పల్సర్ వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్నా అత్తాపురం విద్యాసాగర్, విట్టల్ ఉదరు కుమార్ అనే వ్యక్తులను విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే నిందితులను గుర్తించినందుకు కానిస్టేబుల్లను ఏసీపీ సీహెచ్ శ్రీధర్, ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ అభినందించారు.