Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు
నవతెలంగాణ-ఓయూ
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి దశ దిశా అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ హెల్త్ సెంటర్, ఆర్టీసీ హాస్పిటల్లో పండ్ల, బ్రెడ్డు ప్యాకెట్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, స్వరాష్ట్రాన్ని అభివద్ధి పథంలో తీసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర ప్రజానీకం అందరికీ శుభ దినంగా భావిస్తున్నామన్నారు. దేశ రాజకీయాలకు కేసీఆర్ దశ దిశ కాబోతున్నారు అని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ బోయెళ్ల విద్యాసాగర్, సీనియర్ నాయకులు బండారు వీరబాబు, రఘురాం, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కోతి విజరు, శిగ వెంకట్, కష్ణ, నవీన్ గౌడ్, వేల్పుగొండ వెంకట్, కళ్లెం వెంకట్, సిటీ కోఆర్డినేటర్ యాదవ క్రాంతి, చాగంటి రాములు, గుంటి ప్రభాకర్, కొంపల్లి నరేష్, అఖిల్, పాల్గొన్నారు.