Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తార్నాక డివిజన్ ఆర్యనగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిని మంగళవారం ఆమె కార్యాలయంలో కలిశారు. స్థానికంగా ఉన్న సమస్యలను (కొత్త డ్రయినేజీ వ్యవస్థ, కొత్తపైప్లైన్ ఏర్పాటు, జీ ప్లస్ 2 కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల నిర్మాణం) త్వరగా పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి, యూత్ అసోసియేషన్ సభ్యులు కుమార్, చరణ్ రాజు, నాగరాజు, వరప్రసాద్ పాల్గొన్నారు.