Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హిమాయత్‌నగర్ డివిజన్, షేర్ గేట్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డివిజన్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మీ రామన్ గౌడ్ కలిసి మంగళవారం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం కార్పొరేటర్ డివిజన్ లోని పలు సమస్యలు, అభివద్ధి పనులపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జి.రామన్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కె.నర్సింగ్ ముదిరాజ్, స్థానిక నాయకులు జైశ్వాల్, పి.ప్రసాద్, నర్సింగ్ గౌడ్, మల్లేష్, మహేష్, ప్రవీణ్, శేఖర్, సుధాకర్, నవీన్, సతీష్, శారద, శీలా తదితరులు పాల్గొన్నారు.