Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఈనెల 19న యూని ఎక్సపర్ట్స్ గ్లోబల్ వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు సంస్థ కో ఫౌండర్ ఇంతియాజ్ బన్నూరు తెలిపారు. గురువారం సోమాజిగూడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా, కెనడా, యూకే, యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్ దేశాలలకు చెందిన 50కి పైగా యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొంటున్నట్టు తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఫెయిర్ గొప్ప అవకాశం అని చెప్పారు. ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొనాలనుకునే వారు 9912328645 నెంబరును సంప్రదించాలని కోరారు.