Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో కళలకు పునర్వైభవం వచ్చిందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ కట్ల రాజేంద్రప్రసాద్, వీబీ దర్శకత్వంలో రూపొందించిన 'సమ్మక్క సారక్క జాతర చూడ పోదమా' జానపద వీడియో పాటను సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఫిలిం ఛాంబర్లో గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, కళలకు పూర్వ వైభవం దక్కిందన్నారు. కట్ల రాజేంద్ర ప్రసాద్‌తో తాను చాలా సినిమాలు చేశానని, మేడారంలోని సమ్మక్క సారక్క గురించి చేసిన పాట చాలా బాగుందన్నారు. కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, నటులు శ్రీదేవి, సహా నిర్మాతలు నరేష్ కుమార్, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.