Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ/కంటోన్మెంట్/మల్కాజిగిరి/సరూర్‌నగర్
సీఎం కేసీఆర్ 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా క్రికెట్ పోటీల్లో గెలుపొందిన జట్లకు (మొదటి రూ.లక్ష, ద్వితీయ రూ.50వేలు, తతీయ రూ.25వేలు) బహుమతులను ప్రదానం చేశారు. బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద పటేల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. తుంగ బాలు మాట్లాడుతూ రానున్న రోజుల్లో దేశ రాజకీయాలను శాసించే దిశగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ లాంటి మహా నాయకుడు రాబోతున్నాడని చెప్పారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఈసీ మెంబర్ ప్రకాష్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు విద్యాసాగర్, ఇంటర్నేషనల్ షూటర్ సురభి భరద్వాజ్, బండారి వీరబాబు, రఘురాం, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వెంకట్, శ్రీకుమార్, ఎర్ర వాండ్ల కృష్ణ, ఆవాల హరిబాబు, నవీన్ గౌడ్, క్రికెట్ పోటీల నిర్వాహకుడు కొంపల్లి నరేష్, సంపత్, కృష్ణ ప్రసాద్, ప్రభాకర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ బర్త్‌డే వేడుకలను గురువారం అట్టహాసంగా జరుపుకున్నారు. రసూల్‌పురా గన్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో బోర్డు మాజీ చైర్మెన్ శ్రీనివాస్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సాయన్న విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. బస్టాండ్ వద్ద కార్యకర్తల కోలాహలం మధ్య భారీ కేక్‌ను కట్‌చేశారు. అనంతరం వాలీబాల్ టోర్నమెంట్, దోబీఘాట్లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బోర్డు మాజీ అధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, సభ్యులు నళిని వెంకట్రావు, పాండు యాదవ్, లోకనాథం, ప్రభాకర్, నాయకులు తేజ్‌పాల్, మధుకర్, మహిళా నాయకులు సరిత, మీనా భాస్కర్, దేవులపల్లి శ్రీనివాస్ కుమార్ ముదిరాజ్, కట్టెల మండి శ్రీనివాస్, సంఘసేవకుడు నయీం తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు గౌతంనగర్ డివిజన్ పరిధి మల్లికార్జున్ నగర్ గ్రౌండ్లో హరిహారం కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, నాయకులు జి గణేష్ ముదిరాజ్, ఎం ప్రసాద్ యాదవ్, బైరు అనిల్ కుమార్, మల్లేష్ యాదవ్, కిట్టు, సిద్ధిరాములు, జి ప్రవీణ్ కుమార్, సతీష్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ సీనియర్ ఉద్యమ నాయకులు మొహమ్మద్ సలీం ఆధ్వర్యంలో సరూర్‌నగర్ డివిజన్ ఉర్దూ మీడియం స్కూల్లో విద్యార్థులకు 1000 నోట్ బుక్స్, పండ్లు, మాస్కులు అందజేశారు. కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ కట్ట ప్రవీణ్ ముదిరాజ్, యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్, యశ్వంత్ రెడ్డి, టీఆర్ఎస్ సోషల్ మీడియా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.