Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ప్రతి రోజూ సరైన పోషకాహారం అందజేయాలని బాగ్ అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. బాగ్ అంబర్పేట డివిజన్ వాంబే కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు సరైన పోషకాహారం అందజేస్తూ చిన్నారులకు నాణ్యమైన వసతులు కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్చార్జ్ బి.వెంకటరెడ్డి, అంగన్వాడి సూపర్ వైజర్ స్వాతి, సిబ్బందితో పాటు డివిజన్ అధ్యక్షుడు చుక్కా జగన్ తదితరులు పాల్గొన్నారు.