Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. గురువారం భారతీయ జనతా పార్టీ హైదరాబాదు సెంట్రల్ జిల్లా పదాధికారుల సమావేశం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు అధ్యక్షతన నగర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు, బూత్ స్థాయి నుంచి అభివద్ధి పరచడం, భవిష్యత్ కార్యక్రమాల సమర్థత, మైక్రో డొనేషన్స్ భూత్ స్థాయి నుంచి చేపట్టి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం హైదరాబాదు సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీని బూత్ స్థాయి నుంచి అభివద్ధి చేసి పార్టీతో పాటు అన్ని మోర్చాల కమిటీలను తక్షణమే పూర్తిచేసి ఎన్నికలు ఏ సమయంలో వచ్చిన సిద్ధంగా ఉండాలని చెప్పారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ గోలి మధుసూధన్‌రెడ్డి, రాష్ట్ర కో-ఆర్డినేటర్ పాపారావు, గద్వాల జిల్లా ఇంచార్జ్ బి.వెంకట్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఛాయాదేవి, సందీప్ సాయి, కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు అట్లూరి రామకృష్ణ, బద్దం మాహిపాల్రెడ్డి, ప్రదీప్ కుమార్, లియాఖత్ అలీ, జిల్లా పదాధికారులు, కార్పొరేటర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ అద్యక్షులు పాల్గొన్నారు.