Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హెచ్‌సీఎల్ ఫౌండేషన్
సహకారం అభినందనీయం
హైదరాబాద్ డీఈఓ ఆర్. రోహిణి
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రతపై ప్రాధాన్యత కల్పిస్తున్నామని హైదరాబాద్ జిల్లా విద్యాధికారి ఆర్. రోహిణి అన్నారు. హెచ్‌సీఎల్ ఫౌండేషన్ హైదరాబాదులోని 10 ప్రభుత్వ పాఠశాలలో వాష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించి పునరుద్ధరించడం అభినందనీయమన్నారు. గురువారం ధూల్‌పేట్‌లోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఫస్ట్ ల్యాన్సర్‌లో ప్రభుత్వోన్నత పాఠశాలలో విస్తతమైన ప్రయత్నాలు ఆచరణలో పెట్టామన్నారు. రెండు వెస్టర్న్ టాయిలెట్లు, ఐదు ఇండియన్ టాయిలెట్లు ఉన్న రెండు టాయిలెట్ బ్లాక్స్, ఒక పరిశుభ్రత గది నిర్వహించామన్నారు. ప్రతి బ్లాక్‌లో టాయిలెట్లు ఉపయోగించిన తర్వాత చేతులు కడుక్కోవడానికి ఒక హ్యాండ్ వాష్ బేసిన్ ఏర్పాటు చేయబడిందనీ, అంతేకాకుండా, విద్యార్థినుల కోసం భద్రతా పరామితులను దష్టిలో ఉంచుకొని ప్రహరీ గోడ 2 అడుగుల ఎత్తు పెంచామని తెలిపారు. నీటి నిల్వ ట్యాంక్ కోసం బేస్, సురక్షితమైన నీటిని అందించేందుకు ట్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. కరోనా మహమ్మారితో ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారని హెచ్‌సీఎల్ డైరెక్టర్ నిధి పుందిర్ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బందం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఈఆర్ఎస్ ప్రెసిడెంట్ విజయ ఆనంద్, ఉదరు తదితరులు పాల్గొన్నారు.