Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జన విజ్ఞాన వేదిక జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ముత్తవరపు రవీంద్రబాబు ఆధ్వర్యంలో తెలంగాణలో 8, 9, 10 తరగతులకు నిర్వహించే చెకుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ ప్రచార గోడ పత్రికను అమీర్పేట జవహర్ నగర్లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్ర బాబు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక విద్యార్థులలో పఠనా శక్తి, పరిశీలనాశక్తి, ప్రశ్నించే తత్వం, తార్కిక ఆలోచన, పరిశోధన శక్తి, సజనాత్మకతను పెంపొందించటానికి 30 ఏండ్లుగా చెకుముఖి పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు, వివిధ ఉప న్యాయ సంఘం నాయకులు, శ్రద్ధ తీసుకుని విద్యార్థులందరూ ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి, పరీక్షలకు హాజరు కావటానికి కషిచేయాలని తెలిపారు. ఆన్లైన్లో ఫిబ్రవరి 20వ తేదీన ఉచితంగా నిర్వహించే ఈ పరీక్షకు కావలసిన కార్డులను, ఫిబ్రవరి 18 నాటికి జనవిజ్ఞాన వేదిక బాధ్యులు ఇచ్చే వెబ్ సైట్ లింకు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ హైదరాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర రావు, ఆర్ అశోక్, ఇన్చార్జి పద్మజ, సీనియర్ ఉపాధ్యాయులు సింహాచలం పాల్గొన్నారు.