Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
తెలంగాణ పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'చదువు ఆనందించు అభివద్ధి చెందు' అనే కార్యక్రమంలో భాగంగా గురువారం కూకట్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించారు. విద్యార్థులకు, గద్య, పద్య పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 6 నుండి 9 వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు. పఠనా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విశిష్టమైన కార్యక్రమం ఇది అని ఇందుకు పాఠశాల ఉపాధ్యాయులు అందరూ విశేషంగా కషి చేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ రెడ్డి అన్నారు. ఈ పోటీల నిర్వహణలో న్యాయనిర్ణేతలుగా మల్లారెడ్డి, నర్సింహులు, సత్యనారాయణ రెడ్డి, భాషోపాధ్యాయులు చంద్రశేఖర్, కృష్ణయ్య, సహదేవుడు పాఠశాల గ్రంథాలయ బాధ్యులు మాణిక్యం పాల్గొన్నారు.