Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్లో రోడ్డు అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తామని గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ అన్నారు. గురువారం డివిజన్లో అధికారులతో కలిసి పర్యటించారు అనంతరం మాట్లాడుతూ... కెనరా బ్యాంక్ సమీపం మైత్రి హాస్పిటల్ నుంచి గజేంద్ర నందిని అపార్టుమెంట్ వరకు రూ. 41 లక్షల వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. తాను తీసుకున్న చొరవతోనే నూతనంగా ఎస్ డబ్ల్యు, డ్రైన్ 600, డైయ ఎన్పి, 3 పైప్లైన్ పనుల కోసం నిధులు మంజూరు అయ్యాయని వివరించారు. అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు డిప్యూటీ ఇంజినీర్ సన్ని, అసిస్టెంట్ ఇంజినీర్ శ్రావణి, నగర యువ నాయకులు వినరు కుమార్, సాయి కుమార్, ఆనంద్ రావు, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.