Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
నిరుపేద కళాకారుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జన నాట్యమండలి సీనియర్ కళాకారుడు తెలంగాణ ఉద్యమ కారుడు, గేయ రచయిత జంగ్ ప్రహ్లాద్ కుటుంబానికి కొమురం భీం స్మారక సమితి అధ్యక్షుడు రుద్ర శంకర్‌తో కలిసి ఆర్థిక సహకారాన్ని శుక్రవారం అందించారు. జంగ్ ప్రహ్లాద్ కుమార్తె సాధినేని వెన్నెల చదువుతున్న కళాశాలకు నేరుగా వెళ్లిన వారు కళాశాల చైర్మెన్ నరేష్‌తో మాట్లాడి ఆమె ఫీజుల కోసం రూ.32,500 చెల్లించారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రహ్లాద్ పాత్ర మరువలేనిదన్నారు. ప్రహ్లాద్ కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు సహృదయంతో ముందుకు రావాలని కోరారు.