Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్
నవతెలంగాణ-ధూల్‌పేట్
మాదిగ సేవా సంఘానికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని కార్వాన్ ఎమ్మెల్యే మహమ్మద్ కౌసర్ మొహియుద్దీన్ అన్నారు. జియాగూడ దుర్గ నగర్ బైపాస్ వాటర్ ట్యాంక్ సమీపంలోని మాదిగ సేవా సంఘం భవనం శిలాఫలకాన్ని డివిజన్ కార్పొరేటర్ బోయిన దర్శన్, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సింలు, ఎం చంద్రమోహన్, మండలి అధ్యక్షులు కిషన్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. ఎక్కువ కమ్యూనిటీ ఉన్నా జియాగూడలో సంఘ భవనం ఏర్పాటు చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సంఘానికి, ప్రజలకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అనంతరం సంఘం సభ్యులు ఎమ్మెల్యేలను సత్కరించారు. కార్యక్రమంలో కార్వాన్ నియోజకవర్గం ఎంఐఎం దళిత నాయకులు సాయి కుమార్, కుల్సుమపురా ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, సంఘం ఉపాధ్యక్షులు చెన్నయ్య, టి వెంకటేష్, రాజు, కోశాధికారి మన్యం, జాయింట్ సెక్రెటరీ రామస్వామి, కురుమయ్య, దాసు, రామ్ కుమార్, ఆంజనేయులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.