Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఈ నెల 20 న రవీంద్రభారతి ప్రధాన వేదిక పై ప్రముఖ నటులు అలీకి అలనాటి విఖ్యాత నటులు శోభన్ బాబు పేరిట ఏర్పాటు చేసిన రజిత కిరీటం బహుకరిస్తామని శోభన్ బాబు సేవా సమితి ( తెలంగాణ)అధ్యక్షుడు పద్మ రావు చైర్మెన్ రామ కష్ణ, ప్రధాన కార్యదర్శి లాల్ బహదూర్ శాస్త్రి, శతిలయ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు భీం రెడ్డి, కార్యదర్శి ఆమని పత్రిక విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంస్కతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొనగా రాష్ట్ర శాసన సభ తొలి సభా పతి ఎస్. మధుసూదనా చారి, అఖిల భారత శోభన్ బాబు సేవ సమితి అధ్యక్షుడు సుధాకర్ బాబు, జర్నలిస్ట్ జితేందర్ రావు, రావెల రాకేష్, జీహెచ్ఎంసీ వైస్ చైర్మెన్ లతా రెడ్డి, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు. భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంలో జరిగే ఈ కార్యక్రమంలో శోభన్ బాబు జయంతిని పురస్కరించుకుని ఎవరి చక్కనివాడు శీర్షికన ఉదయం 11 ఘంటల నుంచి రాత్రి 10 ఘంటల వరకూ ఆమని నిర్వహణలో వీ.కె.దుర్గ, సుభాష్, శ్రావణి, పవన్, ప్రసన్న తదితరులు శోభన్ చిత్రాలలోని పాటలను గానం చేస్తారు.