Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
శ్మశాన వాటిక పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ అన్నారు. పార్సిగుట్ట చౌరస్తా వద్ద గల దళిత శ్మశాన వాటికలో జరుగుతున్న అభివద్ధి పనులను శుక్రవారం ఎంఎమ్ఓఎచ్ డాక్టర్ మైత్రేయి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శ్మశాన వాటిక పరిసర ప్రాంతాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న శ్మశాన వాటికకు ప్రహరీ గోడ వెంబడి మొక్కలు నాటడం, సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. రోజుల తరబడి పార్కింగ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసుల సహాయంతో తొలగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ అసెంబ్లీ కో కన్వీనర్ నవీన్ గౌడ్, కంచి ముదిరాజ్ సత్యనారాయణ, శ్మశాన వాటిక అధ్యక్షులు నర్సింగరావు, కార్యదర్శి భాస్కర్, బీజేవైఎం ముషీరాబాద్ కన్వీనర్ గడ్డం నవీన్, సురేష్, సంతోష్ ,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.