Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్్
నవతెలంగాణ-కేపీహెచ్బీ
వికలాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన సొంత ఖర్చులతో అర్హులైన 51 మంది వికలాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేశారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో వికలాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్లో ఐదుగురు వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు రావడం చాలా సంతోషకరమన్నారు. వాహనాలను తమ జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.