Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకష్ణ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
పీవీ రావు స్థాపించిన మాల మహానాడు సంఘాన్ని ఆయన వారసునిగా నీతి, నిజాయితీగా నైతిక బాధ్యతతో నడుపుతున్నానని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకష్ణ అన్నారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మాల మహానాడు కార్యవర్గ సమావేశంలో శ్రీకష్ణ మాట్లాడుతూ పార్లమెంటులో రేవంత్ రెడ్డి, జి.కిషన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో కావాలని మాట్లాడారని, వీరిద్దరు మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్యకు లక్షల రూపాయలు ఇచ్చి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడాలని, వర్గీకరణ వ్యతిరేక సమితి పేరుతో సమావేశాలు నిర్వహించాలని చెప్పడంతో సింహ గర్జన పేరుతో మార్చి నెలలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటనలు ఇస్తూ జి.చెన్నయ్య నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశాల ద్వారా వందలాది మంది కరోనా రోగానికి బలయ్యే అవకాశం ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసిన జి.చెన్నయ్య గచ్చిబౌలిలో పది ఎకరాల్లో ఎస్సీల పేరుతో ఉన్న భూమిని ఒక్కొక్కరి వద్ద రూ.6 లక్షల చొప్పున తీసుకుని, మొత్తం భూమిని రూ.20 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను పత్రికాముఖంగా ప్రకటిస్తే తనను చంపేస్తామని అనేకసార్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం మాల మహానాడు కూకట్పల్లి నియోజకవర్గం ఇన్చార్జ్గా బాసన్ పల్లి రాజును నియమించారు. సమావేశంలో మాల మహానాడు శేరిలింగంపల్లి అధ్యక్షులు సంగమాల వాసు, నాయకులు బండి శ్రీనివాస్, తలారి సాయి తదితరులు పాల్గొన్నారు.