Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాచం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సత్యనారాయణ
నవతెలంగాణ-అడిక్మెట్
ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవార్చుకోవాలి అని కాంచన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాచం సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అప్స స్వచ్ఛంద సంస్థ సామాజిక కార్యకర్తలకు కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవ చేసిన వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి సేవా పురస్కార అవార్డు ప్రదానం చేశారు. కాచం సత్యనారాయణ, ఎమ్మెల్సీ దామోదర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్ మామిడి భీమ్ రెడ్డి చేతుల మీదుగా అప్స స్వచ్ఛంద సంస్థ సామాజిక కార్యకర్తగా 25 ఏండ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న బొట్టు రమేష్, సామాజికవేత్త మధు బాబు చికిలేకు అవార్డును అందజేశారు. ప్రతి ఒక్కరు సేవ భావాన్ని అలమడుచుకోవాల కోరారు. స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు గుర్తించి వారికి అవార్డు ఇస్తున్నామని చెప్పారు.