Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్‌పేట
మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ ఎంపీటీసీ పారుపల్లి నాగరాజు ఆదివారం స్థానిక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ కాటేపల్లి జనార్ధన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు నిధులు మంజూరు చేయాలని విన్నవించామనీ, ఈ మేరకు రూ.20లక్షలు చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపేందుకు కలిసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామిడి వెంకట నర్సింహారెడ్డి, శ్రీకాంత్, లక్ష్మాపూర్ వార్డు సభ్యులు డప్పు సురేష్, యెర్ర కరుణాకర్ పాల్గొన్నారు.