Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం 'శ్రీనివాసన్ మునిస్వామి అండ్ రాధికా అద్దంకి ట్రస్టు' ఆధ్వర్యంలో 'ఎడ్యుకేషన్ ఫర్ ఆల్' ప్రాజెక్టును ఆదివారం గబ్చిబౌలిలో ని హౌటల్లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింభాద్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందక ఎంతో మంది విద్యా కుసు మాలు వెనుకపడిపోతున్నాయన్నారు. ఇలాంటి విద్యార్థుల కలను సాకరం చేసేందుకు స్మార్ట్ ట్రస్టు, శరత్ చంద్రా అద్దం 132 మంది మెరిట్ విద్యార్థుల కుగాను సుమారు రూ.6.5 కోట్లతో ఉన్నత విద్యను అందించేందుకు ప్రాజెక్టు ఆరంభించటం అభినందనీయమ న్నారు.ఈ ప్రాజెక్టు ప్రతి ఏడాదీ మరెంతో మందిని ఆదుకోవాలని ఆకాంక్షించారు. ప్రముఖ సినీ నటి గౌతమి మాట్లాడుతూ ''ఇంకా వేల మంది ఆర్థిక స్తోమత లేక చదు వుకు దూరమవుతున్నారు. ఈ స్మార్ట్ ట్రష్టు చేస్తున్న కృషి హర్షణీయమన్నారు. ప్రభుత్వం కుడా తోడ్పాటు అందిస్తే ఎంతోమంది మెరిట్ స్టూడెంట్లను వెలుగులోకి తీసుకు రావొచ్చని తెలిపారు. ఈ సందర్భంగా బుద్దవనం ప్రాజెక్టు ఓఎస్డీ మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ లింభాద్రి 132 మంది మెరిట్ విద్యార్థులకు ల్యాప్ టాప్‌లను అందజేశారు. డాక్టర్ శరత్ అద్దంకి మాట్లాడుతూ మంచి పని చేయడానికి సంకల్పం దృఢంగా ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా తొలగిపోతాయన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా సాఫ్ట్ స్కిల్స్‌ను పెంచే గైడెన్స్ కుడా అందిస్తున్నా మని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ మామిడాల, సినీ నిర్మాత సునీత తాటి, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, తదితరులు పాల్గొన్నారు.