Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్‌పేట
పేద ప్రజలకు సేవ చేయడానికి కేబీఆర్ ఫౌండేషన్ ఎల్లపుడూ ముందుంటుందని బాల్ రెడ్డి అన్నారు. బాల్ రెడ్డి ఆదివారం తన ఫౌండేషన్ ద్వారా మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలోని డప్పు వాయిద్యకారులకు 30 డప్పులను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏఎంసీ వైస్ చైర్మెన్ ఎం.శ్రీకాంత్‌రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ భిక్షపతి, వార్డు సభ్యులు టి.మురళి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్.మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు వి.వెంకటేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తు గౌడ్, సత్యనారా యణ యాదవ్, శ్రీనివాస్ గుప్తా, శ్రీధర్‌రెడ్డి, గిరిపల్లి రమే ష్, సీహెచ్ లక్ష్మణ్, వి.భిక్షపతి, ఎస్.రాజు పాల్గొన్నారు.