Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
మూడుచింతలపల్లి మండలంలోని కొల్తూరు గ్రామంలో వెంకగళ్ళ నర్సయ్య కూతురు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి అదేశాల మేరకు ఆయన తరపున బాధిత కుటుంబానికి టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు దుర్గం వెంకటేష్ ముదిరాజ్, కార్యదర్శి మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షుడు ఉడుతల వెంకటేష్ గౌడ్ రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు గుండ్లపల్లి మల్లేష్ గౌడ్, మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, డైరెక్టర్ కొండా భిక్షపతి, యూత్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాజీ అధ్యక్షులు అమిరిశెట్టి శ్రీనివాస్ గుప్తా, వార్డు సభ్యులు తాండూరు మురళి, మాజీ ఉపాధ్యక్షుడు రాము, సీనియర్ నాయకులు దత్తు గౌడ్, గిరిపల్లి రమేష్, చెవ్వ రాము, వెంకగల్లా భిక్షపతి, వెంకగళ్ళ బాలయ్య పాల్గొన్నారు.