Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్‌కలెక్టరేట్
కీసరగుట్ట జాతర బ్రహ్మౌత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జాతర పోస్టర్‌ను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీసర గుట్ట జాతర బ్రహ్మౌత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. ఉత్సవాలను విజయ వంతంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేయా లని సూచించారు. అనంతరం కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో మంత్రికి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ తటాకం ఉమాపతి శర్మ, ఫౌండర్ సభ్యులు తటాకం నారాయణ శర్మ, ఈవో కట్ట సుధాకర్‌రెడ్డి, ధర్మ కర్తలు వంగేటి బుచ్చిరెడ్డి, దుర్గం సాయి నాథ్‌గౌడ్, మెరుగు నరేష్ గౌడ్, శిల సాగరం భాగ్యలక్ష్మి నాగేష్, రామిడి బాల్ రెడ్డి, రామిడి మల్లారెడ్డి, బత్తిని వేణుగోపాల్ గౌడ్, బొడుసు రమేష్ యాదవ్ పాల్గొన్నారు.