Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలో మొదటిసారిగా పోలీసులు, మీడియా ప్రతినిధులు మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. పోలీస్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణీత 12 ఓవర్లలో 92/4 పరుగులు సాధించింది. 98 పరుగుల లక్ష్యంతో మీడియా టీం బరిలోకి దిగి 60/6 పరుగులు మాత్రమే చేయడంతో పోలీస్ టీం గెలుపొందింది. బ్యాటింగ్‌లో పోలీస్ టీమ్ నుంచి సీఐ రమేష్ నాయక్ 30 రన్స్, బౌలింగ్ విభాగంలో మీడియా టీమ్ నుంచి ఎన్.రవి 3/1 ప్రతిభ ప్రదర్శించారు. ఉత్తమ ఫీల్డర్‌గా తలారి.శ్రీనివాసరావు నిలిచారు. మ్యాచ్‌లో పోలీస్ టీం కెప్టెన్ రమేష్ నాయక్, వైస్ కెప్టెన్ ఎం.రాజు, క్రీడాకారులు అంజి, నరేష్, విజరు, హరీష్, ఆనంద్, పి.రాజు, మీడియా టీం కెప్టెన్ జే.రాజు, వైస్ కెప్టెన్ ఎన్.రవి, తిరుమల్ రెడ్డి, కుమార్, తలారి శ్రీనివాస రావు, దినేష్, శ్రీకాంత్, రాజు, ప్రవీణ్, ఫిరోజ్, జీవన్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు గణేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్, హరీష్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.