Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయంజాల్
పేదవారికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కోహెడ గ్రామానికి చెందిన సింగిరెడ్డి లక్ష్మమ్మ భర్త యాదిరెడ్డి గత పది రోజుల క్రితం మెదడుకు సంబంధించిన నరాలు చిట్లి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. డాక్టరు పరిశీలించి శస్త్రచికిత్స అవసరమని తెలిపి ఎనిమిది లక్షలు అంచనా వ్యయం అవుతుందని తెలియజేశారు. ఇట్టి విషయాన్ని బాధితులు స్థానిక టీఆర్ఎస్ నాయకులు మండల రైతుబంధు కోఆర్డినేటర్ కందాల బలదేవారెడ్డి దష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి దరఖాస్తు చేయగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మూడు లక్షల 50 వేల ఎల్ఓసీ ఆదివారం బాధితురాలి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మంచిరెడ్డికి సీఎం కేసీఆర్కు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జ్యోతి జంగయ్య, కందాల బిందు రంగారెడ్డి, గంగం శ్రీనివాస్, బుడ్డ విజరు బాబు, పల్లపు ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.