Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల కల సాకారమయింది. ముఖ్యమంత్రి కెేసీఆర్ సంకల్పంతో, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కషితో హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో మేర, మేదర కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ,్ పశు సంవర్థక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీలు వెనుకబడిన వారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డామన్నారు. స్వాతంత్రం వచ్చిన 74 ఏళ్లలో ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వమూ, ఏ ముఖ్యమంత్రి బీసీలను పట్టించుకోలేదని, కనీస వసతి కోసం గుంట జాగ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కులాలు ఆత్మగౌరవంతో తలెత్తుకు బతకాలని హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన స్థలాల్ని కేటాయించారని, 41 బీసీ కులాలకు 83 ఎకరాలు కేటాయించార న్నారు. అంతేకాకుండా భవనాలు నిర్మించుకోవడానికి సైతం ఎకరాకు కోటి రూపాయలు కేటాయించారన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉప్పల్ భగాయత్‌లోని మేర, మేదర కులస్తుల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు శంకుస్థాపన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో బీసీలుగా పుట్టడం అదష్టం అన్నారు. ఉన్నత వర్గాలకు దీటుగా బీసీలు సైతం బతకాలని, వేెల కోట్లు నిధులు ఇస్తే సరిపోదని, వారు ఆత్మ గౌరవంతో ఉండేలా ప్రభుత్వం గౌరవించుకోవాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం అన్నారు. తెలంగాణ పూర్వం 70 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీసీలకు కేవలం 16 గురుకులాలు మాత్రమే ఏర్పాటు చేశాయని, బీసీ బిడ్డలు కూలీ పనులకు వెళ్లకుండా చదువుకుంటారని ఏ ప్రభుత్వాన్ని కోరినా కనీసం కనికరం చూపలేదన్నారు.
కానీ ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు ఉన్నత విద్యను అందించాలని గురుకులాలను 281కి పెంచారని కొనియాడారు. గత 70ఏళ్లలో కేవలం పదివేల మంది మాత్రమే చదివితే, నేడు 1,36,000 మంది చదువుతూ ప్రతీ ఏడు లక్షలాది మంది బీసీ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంతో అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, బీసీ కమిషన్ చెర్మెన్ వకులాభరణం కష్ణ మోహన్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేంద్ర, మేర, మేదర కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.