Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని కార్యాలయంలో శనివారం మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డి అధ్యక్షతన వార్షిక బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతిక్ జైన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2022-23 సంవత్సరానికి గాను సుమారు 88 కోట్ల 29 లక్షల రూపాయలతో బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింద న్నారు. గత సంవత్సరం 84 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టగా అందుకుగాను రూ.43 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని, అందులో సాధారణ నిధులు సుమారు రూ.36 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని, బడ్జెట్ సమావేశంలో సభ ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపడం జరిగిందన్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యుల, సిబ్బంది సహకారంతో కార్పొరేషన్ అభివద్ధి చేయడం జరుగు తుందని, రానున్న రోజుల్లో మన కార్పొరేషన్ అభివద్ధిలో ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ప్రధాన రహదారుల నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నారు. కొత్త కాలనీలు ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అందుకోసం ప్రజలు కూడా సకాలంలో ట్యాక్స్‌లు చెల్లించి కార్పొరేషన్‌కి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జల్ పల్లి మున్సిపల్ .... జల్పల్లి మున్సిపాలిటీలో 2022, 2023 సంవత్సరానికిగాను జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్మెన్ అబ్దుల్లాసాది అధ్యక్షతన ప్రత్యేక బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, కమిషనర్ జి.పి కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రూ.48 కోట్లు 93లక్షలు కేటాయించటం జరిగిందన్నారు. ఈ సంవత్సరంలో రూ.13కోట్ల 46లక్షల జనరల్ ఫండ్ కింద కేటాయిం చామని తెలిపారు. గడిచిన సంవత్సరంకన్నా ఈ సంవత్సరం 5 కోట్లు పెంచడం జరిగిందన్నారు. ఇంటి ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచటం జరిగిందని, అదేవిధంగా జల్పల్లి పెద్ద చెరువు సుందరీకరణ కోసం రూ.9కోట్లు, టీియుఎఫ్ ఐడీసీ నుండి రూ.10 కోట్లు,హెచ్ఎండీఏ నుండి రూ.7కోట్లు కేటాయించామని తెలిపారు. గతంలో ఎన్నడూ ఇంత బడ్జెట్ ఎప్పుడూ కేటాయించలేదని, ఇదంతా విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చొరవతో అత్యధిక నిధులు మంజూరు చేయించటం జరిగిందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని కాపాడడానికి రూ.10కోట్లతో వచ్చే వర్షాల కాలం వరకు, పూర్తిచేయడానికి ప్రయత్నం చేస్తామని, ఈసారి జల్పల్లి మున్సిపల్‌కు అత్యధికంగా బడ్జెట్ కేటాయించారన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీి నల్ల్లా కనెక్షన్ కోసం రూ.79కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగిందని వారు తెలిపారు.