Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద ఆదివారం సిరిపురం.యాదయ్య స్మారక సమితి ఆధ్వర్యంలో యాదయ్య 12వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎంపీ రాపోలు. ఆనంద్ భాస్కర్, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీ హనుమంతరావు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు రాములు, ఓయూ సైన్సు డీన్ ప్రొ.బాలకిషన్, హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గౌతమ్ రావు, ఓయూ జేఏసీ నేతలు రాజునేత, బాలక్రిష్ణ నేత పాల్గొన్నారు.
ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట
ఓయూ జేఏసీ నేతలు బాల క్రిష్ణ నేత, రాజు నేత ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఎదుట యాదయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలం గాణ మలిదశ ఉద్యమంలో భాగంగా పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని జై తెలంగాణ అంటూ నినదిస్తూ పోలీసులపైకి పరుగెత్తిన ధీరుడు సిరిపురం యాదయ్య అని కొనియాడారు. తానొక అగ్నికణమై తెలంగాణ ఉద్యమ మహాయజ్ఞంలో హవిస్సుగా మారి తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో చెరిగిపోని ముద్ర వేశాడన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిరిపురం యాదయ్య జయంతి, వర్థంతి కార్యక్రమాలను రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ వాదులందరూ నిర్వహించి ఘనమైన నివాళి అర్పించాలని కోరారు. కార్యక్రమంలో జగదీశ్ నేత, మహేష్ నేతగ, వెంకన్న, అక్షిత్, శ్రీధర్, అక్షరు, పవన్, సాయి తదితరులు పాల్గొన్నారు.