Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కూకట్పల్లి
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు వాసుదేవ రావు కూకట్ పల్లి శేషాద్రి నగర్ క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యేకు వంద హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుదేవరావును అభినందించారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 51 మంది వికలాంగులకు అందించిన మూడు చక్రాల వాహనదారులకు ఈ హెల్మెట్లను అందజేయస్తామని ఎమ్మెల్యే అన్నారు.