Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
వన్యప్రాణుల సంరక్షణలో జూ కీలక పాత్ర పోషిస్తోందని, హైదరాబాద్ సర్కిల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్ బందం జూ పార్క్‌ను సందర్శించారు. జూలోని జంతువు పక్షాలను తిలకించిన అనంతరం 15 పులులను ఒక ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. వాటి ఏడాది పాటు ఖర్చు రూ. 15 లక్షలు రాష్ట్ర జూ పార్క్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆర్ శోభకు ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ తోటి బందంతో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ డిస్ప్లే కోసం కొత్తగా పునర్నిర్మించిన ఏషియాటిక్ లయన్స్ ఎన్‌క్లోజర్‌లో ఒక జత ఏషియాటిక్ లయన్స్‌ని విడుదల చేశారు. జూ పార్క్‌ను చుట్టి వచ్చి న్యూ బర్డ్ పార్క్ ఎదురుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రాబోయే సంవత్సరాల్లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైగర్లను దత్తత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. పులుల (సాధారణ, తెలుపు) పెంపకం కోసం తెలంగాణ రాష్ట్రం, తీసుకుంటున్న జాగ్రత్తలు, జూ నిర్వహణ పై అటవీ శాఖను ఆయన అభినందించారు. వన్యప్రాణుల సంరక్షణలో ఎస్బీఐ కీలక పాత్ర పోషించడం అభినందనీయమని రాష్ట్ర జూపార్కులో అధికారి ఆర్ శోభ అన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ దేబాసిష్ భట్టాచార్జీ, రీజినల్ మేనేజర్ వై.ఉపేంద్ర భాస్కర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రామకష్ణ, ఇతర అధికారులు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అక్బర్, జూ క్యూరేటర్ ఆర్ శోభ, డిప్యూటీ క్యూరేటర్ నాగమణి, అసిస్టెంట్ క్యూరేటర్ల్రు పీఆర్ ఓ అనిఫ్ తదితరులు పాల్గొన్నారు.